Magazines

మండల వ్యాప్తంగా ఘనంగా దసరా ఉత్సవాలు...

1 గంట క్రితం

dasara
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026 | 1 నిమిషాల చదవడం


నవతెలంగాణ - తొగుట

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆదివారం నిర్వహించిన దసరా ఉత్సవాలు మండల వ్యాప్తంగా ఘనంగా ముగిశాయి. మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో గుడికందుల, ఘనపూర్, పెద్ద మసాన్‌పల్లి గ్రామాలు మినహా మిగతా గ్రామాల్లో దసరా వేడుకలను ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భం గా గ్రామాల్లోని ఆలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సర్పంచులు, ఉపసర్పంచులు, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను ఆనందోత్సా హాల మధ్య నిర్వహించారు. మహిళలు, చిన్నారు లు, యువత ఉత్సాహంగా పాల్గొని దసరా పండు గను సంతోషంగా జరుపుకున్నారు. గ్రామాల్లో ప్రజ లు పరస్పరం జమ్మి ఆకులు ఇచ్చిపుచ్చుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండుగ సందర్భంగా గ్రామాల్లో పండుగ వాతావరణం నెల కొనడంతో సందడి కనిపించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్