నవతెలంగాణ-కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నూతన కమిటీని జిల్లా ఇంచార్జ్ సుగుణకర్ అధ్యక్షతన కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందుగా మందకృష్ణ మాదిగ చేసిన సేవలను విద్యార్థులకు గుర్తు చేశారు.
వృద్దులు, వితంతువులు, వికలాంగులు పెన్షన్లు ఆరోగ్యశ్రీ పథకం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వంటి ఎన్నో సంక్షేమ పథకాలు కేవలం ఎమ్మార్పీఎస్ ఉద్యమ పోరాటాల వల్లనే సాధ్యమయ్యాయని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విద్యార్థుల కీలకపాత్ర పోషించారని, భవిష్యత్తులో కూడా విద్యార్థులే కీలకంగా పనిచేస్తుందని విద్యార్థి లోకం చైతన్యవంతం అయితేనే అసాధ్యాన్ని సాధ్యమయ్యే కృషి ఉంటుందని పిలుపునిచ్చారు. అదేవిదంగా 6న జరిగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సదస్సును విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ ఎఫ్ జిల్లాకో ఇంచార్జి గాడేకర్ మహేశ్వర్, గజేందర్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)