నవతెలంగాణ - కడ్తాల్
కడ్తాల్ మాజీ సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి కి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని అన్మాస్ పల్లి బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు బొర్ర మల్లేష్ బీఆర్ఎస్ అధిష్టానాన్ని కోరారు. చదువుకున్న మేధావిగా, ఎంతోమందికి సేవ చేసిన వ్యక్తిగా, గ్రామ అభివృద్ధి కి పాటుపడిన నేతగా ఎల్ ఎన్ రెడ్డి కి గుర్తింపు ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేతలు ఆలోచన చేసి మా నాయకునికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.






కామెంట్లు (0)