Magazines

రైతు మహాసభలను జయప్రదం చేయాలి 

16 గంటల క్రితం

Farmers' rallies
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

•సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య 

నవతెలంగాణ-మర్రిగూడ 

జిల్లా కేంద్రంలో నవంబర్ 15 నుండి 18 వరకు జరిగే అఖిలభారత 36వ రైతు మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో మహాసభలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నాటి బ్రిటిష్ సామ్రాజవాద విధానానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 1936 లో అఖిలభారత కిసాన్ మహాసభ ఆవిర్భవించిందని నేటికి 90 సంవత్సరాలు అవుతుందని గుర్తు చేశారు.


రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పోరాటాలు చేసిన  ఏఐకేఎస్ దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల రైతాంగానికి సాగు త్రాగునీరు అందించి ఫ్లోరోసిస్ బారిన పడిన బాధితులను అదేవిధంగా ఈ ప్రాంత రైతాంగాన్ని కాపాడాలని కోరారు. డిండి ఎత్తిపోతల పనులను ప్రారంభించి ఏదుల్ల జలాశయం నుండి డిండి ఎత్తిపోతలకు నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. రైతు మహాసభలలో రైతుల సమస్యలపై భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తారని మహాసభలకు మండలం నుండి రైతుల అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.


ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మాధగోని నరసింహ, ఏర్పుల శ్రీశైలం, ఊరు పక్క వెంకటయ్య, లింగోటం నరేష్, భీమనపల్లి కృష్ణ, కేబీ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్