Magazines

శివన్నగూడ రిజర్వాయర్ పూర్తి చేయడమే కూసుకుంట్ల చిరకాల స్వప్నం 

16 గంటల క్రితం

brs
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

•బిఆర్ఎస్ జిల్లా నాయకులు ఊరు పక్కన నగేష్

నవతెలంగాణ - మర్రిగూడ 

మండలంలోని శివన్నగూడ రిజర్వాయర్ ను పూర్తి చేయడమే ఈ ప్రాంత ప్రజలకు త్రాగు సాగునీరు అందించడమే మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చిరకాల స్వప్నమని మండలంలోని పెందుర్తి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ జిల్లా నాయకులు ఊరు పక్క నగేష్ అన్నారు. శుక్రవారం స్థానికంగా అయినా మాట్లాడారు. అనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2015 జూన్ 12న శివన్నగూడ రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేశారని, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎంతో ఉందని గుర్తు చేశారు.


రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 11.96 టీఎంసీలు కాగా, సుమారు 1.55 లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు నేటికీ పూర్తికాకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత ప్రభుత్వాలు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి రైతులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పేరుతో రాజకీయాలు చేసే నాయకులను ప్రజలు గమనించాలని, మాటలకే పరిమితం కాకుండా పనులు చేసి చూపించే నాయకులను గుర్తించాలని ఆయన కోరారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్