Magazines

ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు..

2 గంటల క్రితం

Bathukamma
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - తొగుట

మండల వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఊరు వాడ తేడా లేకుండా మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. గునుగు, తంగేడు, బంతి, చామంతి తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, గౌరమ్మను ప్రతిష్ఠించారు.


తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా మహిళలు, చిన్నారులు నూతన వస్త్రాలు ధరించి బతుకమ్మల చుట్టూ చేరి ఆటపాటలతో సందడి చేశారు. చివరి రోజు సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని ప్రత్యేకంగా తయారు చేసిన సద్దులను నైవేద్యంగా సమర్పించి బతుకమ్మను సాగనంపారు. యువత డీజే పాటలకు ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ సందడి చేయడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. దీంతో మండల వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా ముగిశాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్