Magazines

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు: డీఎస్పీ

51 నిమిషాల క్రితం

will not be ignored
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - మిడ్జిల్ 

గ్రామాలలో ఉన్న నాయకులు ప్రజల తోటి కలిసిమెలిసి ఉండాలని  మహబూబ్నగర్ డిఎస్పి వెంకటేశ్వర్లు అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కంచనపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దళిత సామాజికవర్గానికి చెందిన వార్డు సభ్యుడు చెన్నయ్యపై స్థానిక సర్పంచ్ భర్త, ఆయన అనుచరులు కలిసి భౌతిక దాడికి పాల్పడ్డారు.


ఈ ఘటనపై సమాచారం అందుకున్న మిడ్జిల్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) శ్రీనివాసులు వెంటనే స్పందించి, ఉన్నతాధికారులకు నివేదించారు. ఆదివారం మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు స్వయంగా కంచనపల్లి గ్రామానికి చేరుకుని క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టారు. బాధితుడు చెన్నయ్యతో పాటు స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, దాడికి పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్