నవతెలంగాణ-మిడ్జిల్
మిడ్జిల్ డీలర్ల సంఘం మండల అధ్యక్షులుగా మార్కండేయ గౌడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గుప్త తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన వెల్లడించారు. మండల సంఘం గౌరవ అధ్యక్షుడిగా ఎన్నం శంకరయ్య, అధ్యక్షుడిగా మార్కండేయ గౌడ్, ఉపాధ్యక్షుడిగా ఆచారి, ప్రధాన కార్యదర్శిగా కృష్ణమూర్తి, కార్యదర్శిగా రిజ్వనబేగం, కోశాధికారులుగా లక్ష్మమ్మ, మల్లేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా జంగయ్య ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా వీరారెడ్డి, బాలస్వామి, వెంకటయ్య, చరణ్ కుమార్, భరత్, పాండు తదితరులు ఎన్నుకున్నట్లు తెలిపారు.
అనంతరం తహసిల్దార్ రాఘవేందర్ రెడ్డి నూతన కమిటీని సాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారు. డీలర్ల సమస్యలతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని ప్రజలకు సకాలంలో అందించాలని సూచించారు.
జిల్లా అధ్యక్షుడికి ఘన సన్మానం
రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్నం సత్యనారాయణ గుప్తాను ఆర్యవైశ్య సంఘం నాయకులు, రేషన్ డీలర్లు వేర్వేరుగా శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ సభ్యుల అభినందనలు
ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ సభ్యులు కొంచెం కృష్ణమూర్తి, జూలూరి యాదగిరి, మిడిదొడ్డి విజయ్ కుమార్, మిడిదొడ్డి శ్రీనివాసు గుప్తా, గుబ్బ రాఘవేందర్ గుప్తా, గుబ్బ మల్లేష్ గుప్తా, ఎర్రం బాలస్వామి గుప్తా, మిడిదొడ్డి పురుషోత్తం గుప్తా, ఎన్నం శంకరయ్య గుప్తా, ఎర్రం అఖిల్ గుప్తా, ఎన్నం మహేష్ కుమార్ గుప్తా, మిరియాల శీను గుప్తా, మిడిదొడ్డి నరసింహులు గుప్తా తదితరులు పాల్గొని ఎన్నం సత్యనారాయణ గుప్తాను అభినందించారు. అనంతరం తహసీల్దార్ ను మండల రేషన్ డీలర్ల సంఘం నూతన కార్యవర్గం సభ్యులు కలిశారు .ఈ సందర్భంగా తహసీల్దార్ రాఘవేందర్ రెడ్డి మండల నూతన కార్యవర్గాన్ని శాలువాలతో సన్మానించారు.







కామెంట్‌లు (0)