Magazines

మైనర్ బాలిక అదృశ్యం

1 గంట క్రితం

Minor girl missing
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - అశ్వారావుపేట

మండల పరిధిలోని ఖమ్మం పాడులో మైనర్‌ బాలిక తప్పిపోయిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తల్లి పది సంవత్సరాల క్రితం మృతి చెందగా, తండ్రి పట్టించుకోకపోవడంతో ఆమెను పెద్దమ్మ చిచ్చోడి చంద్రమ్మ పెంచుకుంటోంది. ఈ క్రమంలో ఈ నెల 6న రాత్రి 8 గంటల సమయంలో తన పెద్దమ్మ కుమారుడైన కోనే సీతారామయ్య ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన మైనర్ బాలిక తిరిగి ఇంటికి రాలేదు. దీంతో బాలిక పెద్దమ్మ చంద్రమ్మ అశ్వారావుపేట పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్సై బి. సాయి కిషోర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్