మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఆలేరు మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం
నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు అభివృద్ధికి, సంక్షేమ పథకాలు నియోజకవర్గ ప్రజలకు అందించేందకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మంత్రులతో పోటీ పడుతున్నారని, మంత్రుల వెంటపడి పనులు చేయించుకుంటున్నారని రోడ్లు భవనాల, సినిమాటోగ్రాఫి శాఖ మంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
శుక్రవారం ఆలేరు మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి హాజరయ్యారు.
ఈ క్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ పాలక వర్గం సభ్యులు మంత్రి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీర్ల ఐలయ్యను 75 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. త్వరలోనే మంత్రివర్గంలో బీర్ల ఐలయ్యకు కూడా చోటు లభిస్తుందని స్పష్టం చేశారు. అయిలయ్య సీఎం రేవంత్ దృష్టిలో ఉన్నారని గుర్తు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్నారు.
మార్కెట్ అభివృద్ధి కొరకు శక్తివంచన లేకుండా పనిచేసిన, గత చైర్మన్ ఐనాల చైతన్య మహేందర్ రెడ్డికి పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. ఆమెను సభా ముఖంగా అభినందించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. ఆలేరు అభివృద్ధికి రూ.2 వేల కోట్లతో అభివృద్ది పనులు చేసుకుంటున్నామని చెప్పారు. వచ్చే మరో 5 ఏళ్లు కూడా ప్రజా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి కోమటిరెడ్డి సహకారంతో అన్ని మండలాలకు సాగునీరందిస్తానని చెప్పారు.
ఈ సమావేశంలో ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్, బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బిర్ల అనిత, పిఏ సి ఎస్ చైర్మన్ జనగామ ఉపేందర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ పిక్కా శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ అధికారి, సారంగపాణి, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి, ఆలేరు వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ పద్మజ, సహాయ వ్యవసాయ సంచాలకులు కట్టనిర్మల, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ దేవ్ సింగ్, టెక్నికల్ ఏ డి ఏ రాజేష్, ఆలేరు మండల వ్యవసాయ అధికారి సుధగాని శ్రీనివాస్, చైతన్య, వంగపల్లి, రాజపేట, పిఎసిఎస్ చైర్మన్ లు సుబ్రహ్మణ్యం, నమిలే మహేందర్, రాజపేట , యాదగిరిగుట్ట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బీర్ల శంకర్,మార్కెట్ మాజీ చైర్మన్ ఐనల చైతన్య మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కే సాగర్ రెడ్డి, బుడిగ పెంటయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, కౌన్సిల్ సభ్యులు,మార్కెట్ నూతన డైరెక్టర్లు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, మాజీ డైరెక్టర్లు బిఎసిఎస్ డైరెక్టర్లు పిఎసిఎస్ మాజీ డైరెక్టర్లు సర్పంచులు మాజీ సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గస్థాయి నాయకులు పాల్గొన్నారు.





కామెంట్లు (0)