నవతెలంగాణ - తొగుట : మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన పలు వురి వివాహ వేడుకలకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై నూత న వధూవరులను ఆశీ ర్వదించారు. సుతారి రాములు - సుశీల దంపతు ల కుమార్తె శివాని వివాహం వెంకటేశ్వర్లుతో ప్రజ్ఞా గార్డెన్స్‌లో ఘనంగా నిర్వ హించారు. మిద్దె శ్యామ ల - మల్లేశం దంపతుల కుమారుడు మహేష్ వివా హం రమ్యతో లక్ష్మణ్ గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ రెండు వివాహ వేడుకలకు ఎమ్మెల్యే హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నూతన దంప తులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో కలకాలం కలిసి జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, నాయకులు డబ్బికారి పెంటోజీ, బండారు స్వామి గౌడ్, పిట్ల వెంకటయ్య, సింగోజీ కృష్ణ, బెజ్జనమైన శ్రీనివాస్, పంది కనకయ్య, బాల య్య, కర్ణాకర్, షఫీ తదితరులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)