Magazines

పంచాయతీ కార్మికులకు దుస్తుల పంపిణీ

1 రోజు క్రితం

Distribution
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - తొగుట

గ్రామ పంచాయతీ కార్మికుల సేవలు అభినందనీయమని సర్పంచ్ బండారు కవిత స్వామి గౌడ్ అన్నారు. శనివారం దసరా పండుగ సందర్బంగా గ్రామపంచాయతీ కార్మికులకు కొత్త బట్టలు, శానిటరీ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికై పారిశుధ్య కార్మికులు అహర్నిశలు కృషి చేస్తారని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కార్మికులు ఉదయం నుండి గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతారని కొనియాడారు. వారి సేవలను గుర్తిస్తూ దుస్తులు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో పంచా యతీ కార్యదర్శి రవీందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, ఉపసర్పంచ్ లచ్చోళ్ల లింగం, గ్రామ పార్టీ అధ్యక్షులు పులిగారి శివయ్య, వార్డు సభ్యులు పిట్ట వెంకటేష్, జహంగీర్, కత్తుల వాణి, రమేష్, నాయకులు పెంటోజి, పీట్ల వెంకట య్య, ఈదుగళ్ల పర్శరాములు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్