Magazines

పీఆర్‌టీయూ మండలాధ్యక్షునిగా పంజా రాజమల్లు

20 సెప్టెంబర్, 2026

Rajamallu

Rajamallu, PRTU

avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ పీఆర్‌టీయూ (ప్రోగ్రెస్సివ్ రికగ్నైజ్డు టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్) మండల శాఖ నూతన కమిటీ అధ్యక్షునిగా పంజా రాజమల్లు, ప్రధాన కార్యదర్శిగా ప్రతాప్ రాజయ్య శనివారం సాయంత్రం హుస్నాబాద్ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఎన్నికల్లో ఎన్నుకోబడ్డారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పనిచేయుచున్న ఆంగ్ల ఉపాధ్యాయులు పంజా రాజమల్లు అధ్యక్షునిగా ఎన్నిక కావడం పట్ల వర్షం వ్యక్తం చేశారు. నూతన మండల శాఖ ఎన్నిక పట్ల పీఆర్టియు రాష్ట్ర అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు పుల్గం దామోదర్ రెడ్డి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మల్లు ఇంద్రసేనారెడ్డి, ఆదరాసుపల్లి శశిధర శర్మ అభినందనలు తెలియజేశారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్