Magazines

ఎల్‌నినో ముప్పును ఎదుర్కొనేందుకు గ్రామసభలు

2 గంటల క్రితం

El nino
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

నీటి పొదుపుపై అవగాహన.. ఇంకుడు గుంతలు, బోరుబావుల రీఛార్జ్‌పై ప్రత్యేక దృష్టి

నవతెలంగాణ – ఆలేరు రూరల్

ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలకు అధికారులు శ్రీకారం చుట్టారు. నీటి వనరులను సంరక్షించుకోవడం, భూగర్భ జలాలను పెంపొందించడం, పశువులకు అవసరమైన వసతులు కల్పించడం లక్ష్యంగా ఆలేరు మండలంలోని కందిగడ్డ తండా, గుండ్లగూడెం, సాయిగూడెం గ్రామాల్లో శుక్రవారం గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రణాళికలు, వనరుల గుర్తింపుపై చర్చించారు.


ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవడంతో పాటు గ్రామాల్లో సామూహిక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు బోరుబావుల రీఛార్జ్‌ నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. నీటిని పొదుపుగా వినియోగిస్తూ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.

పశుసంపదను కాపాడుకునేందుకు పశువుల తొట్లు, పశువుల షెడ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని సూచించారు. వి బిజి రామ్ జి పనుల్లో కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని గ్రామాల్లో నీటి సంరక్షణ, కరువు నివారణకు ఉపయోగపడే పనులను చేపట్టాలని వివరించారు.


ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్, ఎంపీవో అనురాధ, ఏఈ ఆర్‌డబ్ల్యూఎస్ సుప్రియ, ఏఈ పీఆర్ నవ్య, పశువైద్యాధికారి డాక్టర్ చైతన్య, ఏపీవో ఎన్.అరుణకుమారి, ఏఈ ఐబీ శివాని, ఏవో శ్రీనివాస్, ఏఈవో షాలిని, టీఏఎస్ వై.రామచంద్రయ్య, మానస, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్