నవతెలంగాణ-మద్నూర్
రాష్ట్రవ్యాప్తంగా కరెంటు కోతలు తీవ్రంగా ఉన్నాయని బీఆర్ఎస్ డోంగ్లీ మండలాధ్యక్షులు రాజు పటేల్ ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కారుచీకట్లోకి వెళ్ళిందని అన్నారు. ఎప్పుడు వస్తుందో.. ఎప్పడు పోతుందో తెలియని అయోమయంలో రైతులున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సాగునీరు లేక అన్నదాతలు, తాగునీరు లేక ప్రజలు అలమటిస్తున్నారని వాపోయారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం విద్యుత్ను అందించామని గుర్తు చేశారు. వెంటనే రైతన్నలకు 24 గంటల విద్యుత్ను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.





కామెంట్లు (0)