*జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ స్పష్టీకరణ*
నవతెలంగాణ - హైదరబా:
ముగిసిన సర్ ప్రక్రియ.. హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో ఒక్క అక్రమ వలసదారుడు కూడా నమోదయి లేడని తేల్చేసింది.
జిల్లా ఎన్నికల అధికారి మరియు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఓటర్ల జాబితాలో కొంతమంది నేపాలీ పౌరులు మాత్రమే కనుగొనబడ్డారని, వారిని తొలగించామని ఆయన తెలిపాడు.
"విదేశీ పౌరులు అయినప్పటికీ, వారు చట్టబద్ధమైన మార్గంలో దేశంలోకి ప్రవేశించినందున, మేము వారిని అక్రమ వలసదారులు అని పిలవలేము. కానీ వారికి ఇక్కడ పౌరసత్వం లేదు మరియు నేపాల్‌లో వారు ఓటు హక్కు కలిగి ఉన్నందున, ఇక్కడ ఓటర్ల జాబితాలో వారిని చేర్చడం చట్టవిరుద్ధం మరియు మేము వారి పేర్లను తొలగించాము," అని కర్ణన్ తెలిపారు.
ఇలాంటి నేపాలీ వలసదారుల ఖచ్చితమైన సంఖ్య ఇంకా అందుబాటులో లేనప్పటికీ, సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలో 10 నుండి 12 మంది వ్యక్తులను గుర్తించినట్లు శ్రీ కర్ణన్ తెలిపారు. హైదరాబాద్ జిల్లా ఓటర్ల జాబితాలో బంగ్లాదేశ్ జాతీయులు, రోహింగ్యా ముస్లింలు లేరని ఆయన తేల్చేసారు.
మయన్మార్ మరియు బంగ్లాదేశ్ నుండి నగరంలోకి అక్రమ చొరబాటుదారులు పెద్ద సంఖ్యలో వచ్చారని, ఎన్నికల ప్రక్రియ పవిత్రతను దెబ్బతీస్తూ సంవత్సరాలుగా ఓటర్ల జాబితాలో నమోదు చేసుకున్నారనే కథనాలు తప్పని తేలుతున్నది. నవంబర్ 2 న, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నగర పర్యటనలో, SIR ప్రక్రియ ఓటర్ల జాబితా నుండి మూడు కోట్ల మంది అక్రమ చొరబాటుదారులను తొలగించిందని పేర్కొనడం గమనార్హం.
SIR 2026 ఓటర్ల జాబితా నుండి చొరబాటుదారులు మరియు అనర్హులను గుర్తించే ప్రత్యేక ఉద్దేశ్యంతో 2002 ఓటర్ల జాబితాలతో మ్యాపింగ్ చేయడము జరిగింది. ఓటర్లు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి 2002 ఓటర్ల జాబితాలో ఉన్న తమ పూర్వీకుల వివరాలను అందించాల్సివచ్చింది. పౌరసత్వాన్ని రుజువు చేసేందుకు పత్రాలతో హాజరుకావాలని 32,36,659 మందికి నోటీసులు జారీ చేశారు. అయితే వారిలో ఎక్కువ మంది 2002 రోల్స్‌తో తమను తాము మ్యాప్ చేసుకున్నారు. మ్యాపింగ్ వివరాలు ఎన్నికల సంఘం ఆప్‌లో అప్‌లోడ్ కాకపోవడానికి ECINET సాఫ్ట్‌వేర్‌లోని అవాంతరాలు కారణమని కర్ణన్ పేర్కొన్నారు.




కామెంట్‌లు (0)