- మాజీ ఎమ్మెల్యే మెచ్చా సమక్షంలో పార్టీలో చేరిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు
- ఏ ఎన్నికలు వచ్చినా గులాబీ జెండా ఎగరడం ఖాయమని మెచ్చా ధీమా
నవతెలంగాణ - అశ్వారావుపేట
మండలంలోని వినాయకపురం పంచాయతీ దిబ్బగూడెంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 30 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో వారు పార్టీలో చేరగా, మెచ్చా గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. హామీల అమలును పక్కనపెట్టి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. గ్రామస్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి ఆదరణ, మద్దతు పెరుగుతోందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల సమన్వయకర్త జూపల్లి కోదండ వెంకట రమణారావు, మండల పరిషత్ మాజీ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షులు జుజ్జూరి వెంకన్నబాబు, నాయకులు మందపాటి రాజు మోహన్‌రెడ్డి, సంక ప్రసాద్, కలపాల బాబురావు, మాజీ ఎంపీటీసీ కన్నమ్మ, మాజీ సర్పంచులు నారం రాజశేఖర్, సాధు జ్యోత్స్నాబాయి, చెన్నారావు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)