Magazines

విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం  

4 రోజుల క్రితం

electrical substation
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

- 33 కేవీ లైన్‌తో విద్యుత్ సరఫరా మెరుగుదల 

- టీజీఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) వి. మోహన్‌రావు ప్రారంభం

నవతెలంగాణ – అశ్వారావుపేట

అశ్వారావుపేట, దమ్మపేట మండలాల పరిధిలోని పలు గ్రామాలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌తో పాటు 33 కేవీ విద్యుత్ లైన్‌ను టీజీఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) వి.మోహన్‌రావు ప్రారంభించారు.


అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం , దమ్మపేట మండలం పార్కలగండి ప్రాంతంలో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా రూ.3 కోట్లతో నూతన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను నిర్మించారు. అలాగే నారంవారిగూడెం నుంచి అచ్చుతాపురం వరకు ఐదు కిలోమీటర్ల మేర రూ.కోటి వ్యయంతో 33 కేవీ విద్యుత్ లైన్‌ను ఏర్పాటు చేశారు.


నూతన సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడంతో అశ్వారావుపేట మండలంలోని అచ్చుతాపురం, నారంవారిగూడెం, దిబ్బగూడెం గ్రామాలతో పాటు దమ్మపేట మండలంలోని రంగువారిగూడెం, కొత్తూరు, అంకినేపల్లి గ్రామాల రైతులు, గృహ వినియోగదారులకు విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని డైరెక్టర్ వి. మోహన్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ సురేందర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ జీ. మహేందర్, అశ్వారావుపేట డివిజనల్ ఇంజనీర్ భద్ర పవర్, ఎంఆర్టీ అండ్ కన్స్ట్రక్షన్ డివిజనల్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట సబ్‌డివిజన్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ బీ. వెంకటరత్నం, ఎంఆర్టీ ఏడీఈ రాంబాబు, కన్స్ట్రక్షన్, ఆపరేషన్ ఏఈలు, ఓఅండ్‌ఎం సిబ్బంది పాల్గొన్నారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్