Magazines

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి

4 రోజుల క్రితం

purchasing centers
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌన్

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, బిజెపి మండల పట్టణ అధ్యక్షులు పూజారి కుమారస్వామి గౌడ్ నంద గంగేష్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆలేరు పట్టణంలో శుక్రవారం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు రైతన్నలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు.


నాణ్యతలేని కరెంటు కొరతతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న రైతన్నల కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం దుర్మార్గమన్నారు. వారం రోజుల్లో కాంటాలు పెట్టి ఒడ్లు కొనుగోలు చేయకపోతే బిజెపి పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యేను ఆలేరులో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి  జిల్లా కార్యదర్శి కామిటికారి కృష్ణ , కౌన్సిల్ నెంబర్ వడ్డేమాన్ నరేందర్, రైతు మోర్చా అధ్యక్షులు పూల హనుమంతు, తునికి దశరథ, కంతుల శంకర్, ఏలగల వెంకటేష్, సుంకరి సృజన్, అమరేందర్, బడుగు జాంగిర్, బైరి మహేందర్ గౌడ్  రైతులు కుమ్మరి నరసింహులు, లక్ష్మి, సీస రేణుక తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్