ఆర్ టి ఐ కార్యకర్త శ్రీకాంత్ గుప్తా
నవతెలంగాణ - కడ్తాల్
కడ్తాల్ మండలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్.టి.ఐ బోర్డు ఏర్పాటు చేయాలని ఆర్ టి ఐ కార్యకర్త శ్రీకాంత్ గుప్తా అన్నారు. సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రతి ఒక్కరికి గడువులోపు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం అడిగిన ఇవ్వకపోతే సమాచార హక్కు కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు సమాచారం హక్కు చట్టం పైన అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతీలలో భారీ ఎత్తున అవినీతి జరుగుతుందని తెలిపారు. యువకులు సమాచారం హక్కు చట్టం పైన అవగాహనతో గ్రామానికి ఎన్ని నిధులు వచ్చావో తెలుసుకోవచ్చు. సమాచార మన వద్ద ఉంటేనే ఎవరినైనా ప్రశ్నించవచ్చని పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)