Magazines

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

4 రోజుల క్రితం

Self-Government Day
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-నెల్లికుదురు 

​మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులే ఉపాధ్యాయులుగా మరి ఒక్కరోజు స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని ప్రధానోపాధ్యాయులు వాణి శ్రీ తెలిపారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం మాట్లాడుతూ.. అన్ని వృత్తులలో కెల్లా ఉపాధ్యాయ వృత్తి గొప్పదని అన్నారు. నిజజీవితంలో ఉపాధ్యాయులు ఎదుర్కొన్న ఒడిదొడుకులు ఈరోజు విద్యార్థులు స్వయంగా అనుభవంతో తెలుసుకున్నారని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించి, ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మంచి పేరు తేవాలని ఆకాంక్ష‍ించారు. కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలు జై రవి, శేఖర్ రెడ్డి, చలాని, ముఖ్య పాత్రధారులుగా నాగరాణి, ఏం రవి  ఉపాధ్యాయులు కే సంపత్ రెడ్డి,శ్రీనివాస్, వెంకన్న, సతీష్ బాబు, ఏం రమేష్,  ఏకంభ్రరచారి, ఎం రవి, పీడీ ప్రవీణ్ , ఫాతిమా, సునీత, సీఆర్పీ వీరస్వామి పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్