నవతెలంగాణ – భిక్నూర్: కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండల కేంద్రంలో శనివారం వీధి కుక్కల దాడిలో 32 మేక పిల్లలు మృతి చెందాయి. స్థానిక రైతులు సిద్దిరాములు, రాములు పెంచుకుంటున్న మేక పిల్లలపై వీధి కుక్కలు దాడి చేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. జీవనోపాధి కోసం పెంచుకుంటున్న మేక పిల్లలు పెద్ద సంఖ్యలో మృతి చెందడంతో బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న మండల పశువైద్య సహాయ శస్త్రచికిత్సకురాలు డాక్టర్ జనుగం దివ్యశ్రీ సంఘటనా స్థలాన్ని పరిశీలించి రైతుల నుంచి వివరాలు సేకరించారు. మృతి చెందిన మేక పిల్లలకు నిబంధనల ప్రకారం పోస్టుమార్టం నిర్వహించి నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిపారు. మిగిలిన జీవాలను వీధి కుక్కల నుంచి రక్షించుకునేందుకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.





కామెంట్లు (0)