Magazines

ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన

22 నిమిషాల క్రితం

Traffic rules
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-నెల్లికుదురు 

మండల కేంద్రంలోని టిటిజిఎంఎస్ విద్యార్థులకు బుధవారం ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ర్యాలీని నిర్వహించామని పాఠశాల ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అంజి సుల్తానా, ఉపేందర్ రావులు మాట్లాడుతూ.. రవాణా వ్యవస్థ పాఠ్యాంశంలో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించామని పేర్కొన్నారు. తద్వారా హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ సిగ్నళ్లు పాటించడం, రోడ్డు భద్రతా నియమాలను అనుసరించడం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు. పాఠ్యాంశాలను ర్యాలీలు, క్షేత్ర పర్యటనల ద్వారా ప్రత్యక్ష అనుభవంతో నేర్చుకోవడం వల్ల విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, ఆచరణాత్మక పరిజ్ఞానం పెంపొందుతాయని ఉపాధ్యాయురాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్