Magazines

విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

5 రోజుల క్రితం

drugs
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం

జిల్లా అదనపు ఎస్పీ సిహెచ్ సత్యనారాయణ 

నవతెలంగాణ-ఆలేరు టౌను

విద్యార్థులు డ్రగ్స్, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, జిల్లా అదనపు ఎస్పీ సిహెచ్, సత్యనారాయణ విద్యార్థులకు సూచించారు. చిన్న వయస్సు నుంచే మంచి లక్ష్యాలను ఏర్పరచుకొని, క్రమశిక్షణతో విద్యనభ్యసించాలని పేర్కొన్నారు. ఆలేరు పట్టణంలో 

యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు ఎస్పీ సీహెచ్. సత్యనారాయణ గురువారం రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ, మంగ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థి యువ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 


మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా యాదగిరిగుట్ట డీఎస్పీ పి. శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ ఈవ్ టీజింగ్ తీవ్రమైన నేరమని, మహిళలు, బాలికలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. విద్యార్థినులను వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడం, సోషల్ మీడియా ద్వారా ఇబ్బందులకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. 


ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట సీఐ ఎం. శంకర్ గౌడ్, ఆలేరు ఎస్‌హెచ్‌ఓ కిరణ్ కుమార్, ఎస్‌ఐ వినయ్, రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు పులిపలుపుల మహేష్ గౌడ్ , మంగ ఫౌండేషన్ అధ్యక్షుడు మంగ నరసింహులు, కౌన్సిలర్లు పాశికంటి సంపత్, బీజని కళ్యాణి, మధు కుమార్ ,నాయకులు  బబ్బూరి పోశెట్టి, సీసా సత్తయ్య, మంగ అరవింద్, ఐలి సందీప్, కళ్లెం జితేందర్, మొరిగాడి సిద్ధులు, కంతుల శంకర్, వడ్డెమాను నరేందర్, ఎలాగల వెంకటేష్, ఎండీ ఫయాజ్, మహమూద్, ఐలి భార్గవ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్