ఢిల్లీ ఆందోళనకు బయలుదేరిన మండల, జిల్లా నాయకులు
నవతెలంగాణ-మద్నూర్
తెలంగాణ గళం బలం చూపిద్దాం అంటూ కాంగ్రెస్ పార్టీ పిలుపుకు మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దరాస్ సాయిలు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు యూనుస్ పటేల్, జిల్లా పార్టీ కార్యదర్శి సంతోష్ పటేల్, ఢిల్లీ ఆందోళనకు బయలుదేరారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టేందుకు ఆ పార్టీ దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి నాయకులను ఆహ్వానించింది.
ఢిల్లీలో నవంబర్ 1న జరిగే కాంగ్రెస్ పార్టీ ఆందోళన విజయవంతం కావడానికి తెలంగాణ రాష్ట్రం నుండి అదేవిధంగా కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ నాయకులు డోంగ్లి మండలంలోని ఎనబోరా గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు యూనుస్ పటేల్ మద్నూర్ మండలం కోడిచెర గ్రామ మాజీ సర్పంచ్ జిల్లా పార్టీ కార్యదర్శి సంతోష్ పటేల్ మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ గళం బలం చూపిద్దాం ఢిల్లీ ఆందోళన విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు.







కామెంట్‌లు (0)