నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని నైనాల గ్రామ ప్రజల ఆరోగ్య భద్రతే తమ లక్ష్యం అని సర్పంచ్ యాసం సంధ్యా రమేష్ తెలిపారు. గురువారం యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టారు. గ్రామ వెటర్నరీ డాక్టర్ సోమ శ్రీనివాసుతో కలిసి రేబిస్ నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రజా ఆరోగ్యం పరిరక్షణతో పాటు జంతువుల ఆరోగ్యానికి కూడా ప్రధాన్యతనిస్తున్నట్టు తెలిపారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ, పంచాయతీ కార్యదర్శి వినోద్, వెటర్నరీ సిబ్బంది సత్యనారాయణ, శోభన్, గ్రామ పంచాయతీ సిబ్బంది యాకాలు, పిచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)