దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి యువకులను ఏకం చేస్తా
తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి కష్టపడి పని చేస్తా
కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు వల్లూరి నాగరాజు యాదవ్
నవతెలంగాణ-మిడ్జిల్
గ్రామస్థాయి నుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతమైన లక్ష్యంగా యువకులందరినీ ఏకం చేసి దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి యువ నాయకుడు రాహుల్ గాంధీనీ ప్రధానమంత్రి చేయడం లక్ష్యంగా గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు వల్లూరు నాగరాజు యాదవ్ చెప్పారు. శనివారం నవ తెలంగాణతో మాట్లాడుతూ,
మండలంలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుండి మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి పేదవాడికి అందేలా చూస్తామని, వాటిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామని చెప్పారు. వేముల గ్రామ అధ్యక్షుడిగా గ్రామ నాయకులతో కలిసి గ్రామ అభివృద్ధికి, ఎంతో కృషి చేశానని , వేముల గ్రామంలో 24 గంటలు విద్యుత్ సరఫరా కోసం సింగిల్ పీస్ లైన్ ఏర్పాటు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పనులు చేయించమని పేర్కొన్నారు. ఎంతోమందికి సీఎం సహాయనిది చెక్కులను అందజేసినట్లు , అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో వైద్య ఆరోగ్య సేవలు అందించడానికి 16 లక్షల రూపాయ పల్లె దావకాన నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహ్మద్ గౌస్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, గ్రామ పార్టీ నాయకులకు అధిష్ఠానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మండలంలో తిరుగులేని శక్తిగా ఎదగడానికి కృషి చేస్తానని తెలిపారు.







కామెంట్లు (0)