నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని కొన్ని గ్రామాలలో ఉదయం సాయంత్రమునే తేడా లేకుండా నిరంతరాయంగా వీధిలైట్లు వెలుగుతూనే ఉన్నాయి.తద్వారా వీధిలైట్లు కాలిపోవడం మరల కొత్తవి బిగించడంతో ప్రజాధనం వృధా కావడమే కాకుండా,వాటి ఏర్పాటుకు సమయం వృధా అవుతుందని,ఆ సమయంలో కొంత కరెంటు కొరత కూడా ఏర్పడుతుందని సంబంధిత అధికారులు,ప్రజా ప్రతినిధులు సమస్యను గ్రహించి వీధిలైట్లపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని సంబంధిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు.







కామెంట్‌లు (0)