Magazines

వీబీ–జీ గ్రామ్‌జీ పథకంపై మేట్లకు శిక్షణ

47 నిమిషాల క్రితం

Training for mates
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – అశ్వారావుపేట

అశ్వారావుపేట మండలం నారాయణపురం రైతు వేదికలో శుక్రవారం వీబీ–జీ రామ్ జీ (వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్–గ్రామీణ) పథకంపై మేట్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని 15 గ్రామపంచాయతీలకు చెందిన 40 మంది మేట్లు, పంచాయతీ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఎంపీడీవో కిషోర్ మాట్లాడుతూ పథకం కింద పనుల నిర్వహణ, కొలతల నమోదు, ప్రస్తుతం చేపడుతున్న పనుల వివరాలు, కొలతలు నిర్ణయించే విధానంపై మేట్లకు అవగాహన కల్పించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రైతు వేదికలో తరగతులు నిర్వహించగా, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అల్లం మహాలక్ష్మి ఫార్మ్ పాండ్ వద్ద క్షేత్రస్థాయి శిక్షణ ఇచ్చారు. పనుల మార్కింగ్, కొలతలను ప్రత్యక్షంగా వివరించారు.


కార్యక్రమంలో ఏపీఓ కే. రామచంద్రరావు, టీఏలు కే. బాలకృష్ణ, వి. కామేశ్వరి, అస్మా, బి. మహేష్, నారాయణపురం సర్పంచ్ మడకం కుమారి ఆంధ్రయ్య, పంచాయతీ కార్యదర్శులు క్రాంతికుమార్, జగదీష్, వ్యవసాయ శాఖ ఏఈఓ రవీంద్ర, సొసైటీ సీఈఓ అరుణ, సండిపోగు రవి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్