కాచికల్ గ్రామ సర్పంచ్ ఇట్టే లీలా దేవేందర్ రెడ్డి
ఐసీడీఎస్ సూపర్వైజర్ జలగం సునిత
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని కాచికల్లు గ్రామంలో వీసీపీసీ కమిటీని ఎన్నుకున్నట్టు సర్పంచ్ ఇట్టేలీల దేవేందర్ రెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ జలగం సునీత తెలిపారు. గురువారం గ్రామంలో అంగన్‌వాడీ సెంటర్‌లో కమిటీ వేసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బాల్య వివాహాలను అరికట్టాలని సూచించారు. బాలల అక్రమ రవాణాను నియంత్రణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని అన్నారు. అనంతరం వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మల్లికార్జున, ఉపాధ్యాయులు శ్రీనివాస్, అంగన్‌వాడీ టీచర్లు అలివేలు, వినోద, తార, ఆశ కార్యకర్త, తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)