Magazines

ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందేనా.!

1 గంట క్రితం

Indiramma Sarees
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం

మండలానికి చేరిన 10 వేల చీరలు

పంపిణీలో సందిగ్ధం

నవతెలంగాణ-మల్హర్ రావు

మండలంలో గతేడాది బతుకమ్మ చీరలను ఇప్పటికీ పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదనే అపవాదు ఉంది.ఈ ఏడాది బతుకమ్మ పండుగ సమీపించినా చీరలు పంపిణీపై సందిగ్ధత నెలకొంది.సమాఖ్య మహిళా సంఘాల సభ్యులకు బతుకమ్మ పండుగకు చీరలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినా గత సంవత్సరం పండుగకు ఇవ్వలేక పోయింది.ఆలస్యంగానైనా ఈ ఏడాది జనవరిలో అన్ని గ్రామాల్లోకి స్వశక్తి మహిళ సంఘాల ద్వారా చీరలు పం పించింది.మండలంలో మొత్తం సంఘాలు 723 ఉండగా ఇందులో 7461 మంది సబ్యులున్నారు.


ఈ ఏడాది 10 వేల బతుకమ్మ చీరలు కొయ్యుర్ శ్రీలక్ష్మి మండల సమాఖ్య కార్యాలయానికి చేరిన ఇంకా పంపిణీపై సందిగ్దత నెలకొంది.18 సంవత్సరాలు దాటిన యువతలు,మహిళలు మొత్తం 11,780 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది.

పంపిణీలో సందిగ్దత..

తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యత గల పండుగల్లో బతుకమ్మ ఒకటి. గత ప్రభుత్వం బతుకమ్మ పండుగ కోసం 18ఏళ్లు నిండి, తెల్ల రేషన్ కార్డు ఉన్న యువతులు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం కొనసాగించింది. గతేడా ది(2025)లో బతుకమ్మ చీరలను ముందుగా మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారికి ఇచ్చి,ఆ తర్వాత 18ఏళ్లు నిండిన యువతులు,మహిళలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.


పంపిణీలో మహిళా సంఘాల సభ్యుల తోపాటు కొత్తగా సంఘాల్లో చేరే వారి కోసం గతేడాది చీరలు సరఫరా చేశారు.వాటిని వంద శాతం పంపిణీ చేయకపోవడంతో ఇప్పటికీ కొన్ని మహిళా సంఘాల ఆర్పీల వద్దనే ఉండిపోయాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ ఏడాది బతుకమ్మ పండుగకు మరో రెండు రోజులే ఉండగా,ఈసారి పండుగకు మహిళలకు చీరల పంపిణీ లేనట్లే అనిపిస్తుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్