తహశీల్దార్ కు వినపత్రం అందజేసిన సర్పంచ్
నవతెలంగాణ - మల్హర్ రావు
తాడిచెర్ల గ్రామ పరిధిలోగల శాత్రజ్ పల్లిలో ఈ నెల 10న అర్ధరాత్రి ముందస్తుగా సమాచారం లేకుండా దాదాపు 347 ఇండ్లను బుల్లోజర్లతో కూల్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం బాధితులతో పాటు సర్పంచ్ బండి స్వామి తహశీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. అక్రమంగా కూల్చివేసిన అధికారులు సంఘటనపై సమగ్ర విచారణ జరిపించి, బాధితులకు నష్టపరిహారం అందించాలని కోరారు.
శార్రాజ్ పల్లిలో వ్యవసాయ పనులు, నివాస అవసరాల కోసం, పశువుల సంరక్షణ కోసం తమ సొంత ఖర్చులతో గృహాలు, పశువుల కొట్టాలు, ఇతర నిర్మాణాలను నిర్మించుకొని గత కొంతకాలంగా వినియోగించుకుంటున్నామని తెలిపారు. అయితే ఏమాత్రం జాలీ, దయ లేకుండా అర్థాంతరంగా అర్ధరాత్రి వందల ఇండ్లను నేలమట్టం చేయడం దారుణమని వాపోయారు. దీంతో పశువులకు, తమకు సంరక్షణ లేకుండా పోయిందన్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు.






కామెంట్లు (0)