నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీ హౌసింగ్ బోర్డ్లో ఏర్పాటు చేసిన అమ్మవారికి ప్రజలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం దుర్గమ్మకు కుంకుమర్చన చేశారు. ఇందుకోసం మహిళలందరూ సాంప్రదాయ వస్త్రాలను ధరించి, తల్లిని దర్శించుకుని, తమపై ఎల్లప్పుడూ మీ అనుగ్రహం ఉండాలని కోరుకున్నారు. పూజల అనంతరం మహన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కాలనీలో పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులైన కె రామారావు, ఎస్ గంగారాంల ఆధ్వర్యంలోనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. వారు ఆంజనేయ స్వామి ఆలయాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. ప్రత్యేక కార్యక్రమాల కోసం భారీ షెడ్డును నిర్మించారు. ఈ షెడ్డులోనే గణేష్ ఉత్సవాలు, దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటాయి.






కామెంట్లు (0)