Magazines

గ్రామ పరిశుభ్రతలో పారిశుధ్య కార్మికుల పాత్ర మరువలేనిది

1 గంట క్రితం

midjil
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం

సర్పంచ్ శ్రీశైలం యాదవ్

నవతెలంగాణ - మిడ్జిల్‌
గ్రామ పారిశుధ్యం, పరిశుభ్రతలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు ఎనలేనివని సర్పంచ్ శ్రీశైలం యాదవ్  కొనియాడారు. శుక్రవారం మండలంలోని ముసిగుండ్లపల్లి గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు సర్పంచ్ సొంత ఖర్చులతో దసరా పండుగను పురస్కరించుకొని మహిళలకు చీరలను, పురుషులకు బట్టల పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాన్ని రోగాల బారిన పడకుండా, నిరంతరం శుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. సమాజంలో వారి పాత్ర ఎంతో గౌరవప్రదమైనదని, వారి శ్రమను గుర్తించి గౌరవించుకోవడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. పండుగ పూట కార్మికుల ముఖాల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతోనే ఈ చిన్న కానుకను అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.


గ్రామస్తులు కూడా పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ, తడి-పొడి చెత్తను వేరు చేసి కార్మికులకు అందిస్తూ గ్రామాభివృద్ధికి, పారిశుధ్య నిర్వహణకు సహకరించాలని సర్పంచ్ కోరారు. సర్పంచ్ చేతుల మీదుగా చీరలు అందుకున్న మహిళా కార్మికులు తమను గుర్తించి ఆదరించినందుకు సర్పంచ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ శుభ్రతకు సంబంధించిన పనిముట్లను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బర్రె జనార్ధన్ పంచాయతీ కార్యదర్శి మధు కుమార్, వార్డు సభ్యులు మల్లేష్, లాలు, గ్రామ పెద్దలు,పారిశుద్ధ కార్మికులు , తదితరులు పాల్గొన్నారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్