- డ్రాలో విజయం సాధించిన దుబాకుల నిర్మల
- బార్ కోసం 357 మంది దరఖాస్తు
నవతెలంగాణ - అశ్వారావుపేట
తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ బార్ల కేటాయింపునకు చేపట్టిన లాటరీ ప్రక్రియ ముగిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో శుక్రవారం నిర్వహించిన డ్రాలో అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని బార్ ను పాల్వంచ కు చెందిన దుబాకుల నిర్మల దక్కించుకున్నారు. అశ్వారావుపేట బార్ కేటాయింపు కోసం మొత్తం 357 మంది దరఖాస్తు చేసుకోగా, లాటరీ లో టోకెన్ నంబర్ 244 విజయం సాధించింది. ఈ విషయాన్ని అశ్వారావుపేట ఎక్సైజ్ సీఐ కె. సాంబమూర్తి వెల్లడించారు.






కామెంట్లు (0)