నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులకు శుక్రవారం మున్సిపల్ కార్యాలయం వద్ద, సంతూర్ సబ్బులు, బట్టల సబ్బులు, కొబ్బరి నూనెతో పాటు మాస్కులు, గ్లౌజులు, అప్రాన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బిజన బాలమణి భాస్కర్ మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని, వారు ప్రతిరోజు ప్రజారోగ్యం కోసం అందిస్తున్న సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
పారిశుధ్య కార్మికులు తమ విధులను నిర్వహించే సమయంలో వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ, మాస్కులు, గ్లౌజులు, ప్రాన్లు వంటి రక్షణ పరికరాలను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అంగిడి అంజనేయులు, కౌన్సిలర్లు వనరాసి మరియమ్మ మార్క్, పస్తం అంజనేయులు, మల్లెల సరిత శ్రీకాంత్, జూకంటి సంపత్, జెట్టా నిరజ సిద్దులు, మున్సిపల్ మేనేజర్ బి.జగన్ మోహన్, శానిటరీ ఇన్స్పెక్టర్, స్. స్వామి , జవాన్లు,మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.





కామెంట్లు (0)