Magazines

'జేవీఆర్' డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవాల సంబురానికి సన్నాహాలు

1 గంట క్రితం

Sattupally
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి

 సత్తుపల్లిలోని జలగం వెంగళరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థాపించి 50 సంవత్సరాలైన సందర్భంగా ఆ కళాశాల స్వర్ణోత్సవాలను డిసెంబర్ నెలలో ఘనంగా నిర్వహించేందుకు పూర్వ విద్యార్థుల సంఘం సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం పూర్వ విద్యార్థుల సంఘ బాధ్యులు, ఆ సంఘ అధ్యక్షుడు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్‌ను స్థానిక ద్వారకాపురిలోని ఎమ్మెల్యే అధికారిక క్యాంప్ కార్యాలయంలో కలిశారు.


ఈ సందర్భంగా స్వర్ణోత్సవాల నిర్వహణ, ఏర్పాట్ల అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 18న (ఆదివారం) డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ముఖ్య సమావేశం జరుగుతుందని సంఘ అధ్యక్షుడు డాక్టర్ దయానంద్ విజయకుమార్ తెలిపారు. ఆదివారం జరిగే ఈ సమావేశానికి పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై స్వర్ణోత్సవ సంబరాలను విజయవంతం చేయడానికి తమ వంతు సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘ బాధ్యులు దారా కృష్ణారావు, గాదె నరసింహారెడ్డి, దొడ్డా కృష్ణయ్య, ఫయాజ్, ఉడతనేని అప్పారావు, కమల్ పాషా, గుడ్ల వెంకట రమణ, బాల నాగేశ్వరరావు, గుండ్రోతు నరసింహారావు, జి. వెంకటరెడ్డి, మలిరెడ్డి మురళీరెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్