- సినిమా సెట్టింగ్ ను తలపిస్తున్న దుర్గా మాత మండపం
- సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక శోభ
నవతెలంగాణ - బీబీపేట్
మండలంలోని జనగామ గ్రామంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, విద్యాదాత సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో పాటు ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపుతున్నాయి. దుర్గ మాత మండపం సినిమా సెట్టింగ్ని తలపిస్తుందని అక్కడికి వచ్చే భక్తులు పేర్కొంటున్నారు.
ఉత్సవాల సందర్భంగా మండపం వద్ద గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్ పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన చర్యలు చేపడుతున్నారు. ప్రతిరోజూ ప్రత్యేక మాస్టార్లను నియమించి దాండియా ఆటలను నిర్వహిస్తుండటంతో మహిళలు, యువత, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ సంప్రదాయబద్ధంగా దాండియా ఆటలు ఆడుతూ ఉత్సవాల్లో ఉత్సాహంగా భాగస్వాములవుతున్నారు. దసరా పండుగ రోజున మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్ తెలిపారు. దసరా పండుగను పురస్కరించుకుని జనగామ గ్రామంలో నవరాత్రి ఉత్సవాలు రోజురోజుకూ మరింత ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.






కామెంట్లు (0)