Magazines

కాయకల్ప అవార్డు సాధించిన ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి

1 గంట క్రితం

Kayakalp Award
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం

- నాణ్యమైన వైద్య సేవలకు గుర్తింపు

- వైద్య బృందాన్ని అభినందించిన డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రవికుమార్‌

- వైద్య సేవల మెరుగుదలకు సహకరించిన కలెక్టర్‌ అంకిత్‌, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

నవతెలంగాణ - అశ్వారావుపేట

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, వైద్య వ్యర్థాల నిర్వహణ, ఇన్ఫెక్షన్ల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, రోగులకు అందించే సేవలు, ఆసుపత్రి నిర్వహణలో నాణ్యతా ప్రమాణాల ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కాయకల్ప అవార్డుల పోటీలో అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి తొలిసారిగా అవార్డును సాధించింది. గిరిజన, మారుమూల ప్రాంతాల్లో అనేక సవాళ్లను అధిగమించి ఈ గుర్తింపు పొందడం విశేషం.


రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతోపాటు ఆసుపత్రిలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ, వైద్య సేవల నాణ్యతను పెంపొందించడంలో కృషి చేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాధారుక్మిణితోపాటు వైద్యులు, వైద్య సిబ్బందిని డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ జి. రవికుమార్‌ అభినందించారు. ఆసుపత్రి వైద్య బృందాన్ని సమన్వయం చేస్తూ, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేసిన డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రవికుమార్‌ను జిల్లా కలెక్టర్‌ అంకిత్‌, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అభినందించారు.

గిరిజన, మారుమూల ప్రాంతాల్లోని ఆసుపత్రులకు పరిమిత వనరులు, రవాణా సౌకర్యాల కొరత వంటి సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి కాయకల్ప అవార్డు సాధించడం ఆసుపత్రి వైద్య బృందం సమష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు.


ఆసుపత్రిని ఎప్పటికప్పుడు సందర్శిస్తూ, రోగులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించిన జిల్లా కలెక్టర్‌ అంకిత్‌, ఎమ్మెల్యే జారె ఆదినారాయణకు డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రవిబాబు, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాధారుక్మిణి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు ఆసుపత్రి సిబ్బందిలో మరింత స్ఫూర్తిని నింపడంతో పాటు భవిష్యత్తులో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రోత్సాహాన్నిస్తుందని వారు పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్