కాపురంలో నిర్వాసితుల వద్ద అక్రమ వసూళ్లు నిజం కాదా.?
ఘాటు వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకులు
నవతెలంగాణ-మల్హర్ రావు
మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ స్తాయిని మరిచి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుపై వ్యక్తిగత దూషణలు చేయడం, ఏకవచనంతో మాట్లాడడం సరికాదని, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఖబర్దార్ పుట్ట అంటూ ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ బండి స్వామి, పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షురాలు కొండ రాజమ్మ, యూత్ అధ్యక్షుడు, చిన్నతూండ్ల సర్పంచ్ గడ్డం క్రాంతి హెచ్చరించారు. కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
శాత్రజ్ పల్లిలో ఇండ్లను మంత్రియే కులగొట్టమని చెప్పినట్లుగా అ వాస్తవాలు ప్రచారం సరికాదన్నారు. అది రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా, సగరేణి కేంద్రం పరిధిలోనే జరిగిందనేది తెలియదాని ప్రశ్నించారు. దమ్ముంటే శత్రజ్ పల్లి బాధితుల కోసం ప్రతిపక్ష నాయకుడిగా రాజీలేని పోరాటాలు చేయాలని హితువు పలికారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పుట్ట అనుచరులతో కాపురం నిర్వాసితుల వద్ద ఇంటికి రూ.1లక్ష 20 వేలు అక్రమంగా వసూళ్లు చేసింది నిజం కాదాని ప్రశ్నించారు. మాటిమాటికి దుద్దిళ్ల కుటుంబంపై విమర్శలు చేస్తే ప్రజాదరణ రాదని, ప్రజలవైపు పోరాటం చేస్తూ ప్రభుత్వంపై శాంతియుతంగా ఒత్తిడి తీసుకరావాలన్నారు.
అధికారులు ఇండ్లు నేలమట్టం చేస్తున్నారని తెలియగానే అర్ధరాత్రి సంఘటన స్థలానికి వెళ్లి ఆపే ప్రయత్నం చేశామన్నారు. మంత్రి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. విమర్శలు, ప్రతి విమర్శలు సహజం కానీ వ్యక్తిగత కూతలు కూయడం సిగ్గుసేటన్నారు. దుద్దిళ్ల కుటుంబంపై వ్యక్తిగత దూషణలు చెస్తే నాలుకకు వాతపెట్టి మండలానికి రాకుండా అడ్డుకుంటామని ఘాటుగా విమర్శించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, వార్డు సభ్యులు ఇందారపు చెంద్రయ్య, వొన్న తిరుపతి రావు, సారయ్య, కాంగ్రెస్ నాయకులు కుంభం రమేష్ రెడ్డి, కేశారపు చెంద్రయ్య, రాజు నాయక్, కిషన్ నాయక్, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.






కామెంట్లు (0)