నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని చిన్న ఎక్లారా గ్రామాన్ని కరెంటు లో వోల్జేజీ సమస్య తీవ్రంగా ఇబ్బందిపెడుతోందని సర్పంచ్ మాధవరావు పేర్కొన్నారు. దీంతో బోరు మోటార్లు పనిచేయడం లేదని, తాగునీరు, సాగునీటితో పాటు పశువులు తాగడానికి కూడా నీళ్లు దొరకడం లేదని వాపోయాడు. త్రీపేజ్ పవర్ ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదని చెప్పారు. ఈ విషయమై ఏఈ ని వివరణ కోరగా.. సబ్స్టేషన్లో ప్లీడర్ ప్రాబ్లమ్ ఉందనీ, సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామని వివరించారు.







కామెంట్లు (0)