బొగ్గు టిప్పర్లను అడ్డుకున్న రైతులు
నవతెలంగాణ-మల్హర్ రావు
తాడిచెర్ల ఓసిపి నుంచి నిత్యం వందలాది బొగ్గు టిప్పర్లు,లారీలు పరిమితికి మించి ఓవర్ లోడ్,అధిక వేగంతో వెళ్లడం ద్వారా రోడ్లు ధ్వంసం కావడమే కాకుండా రోడ్డుకు ఇరువైపులా ఉన్న పత్తి,వరి, మిర్చి పంటలు దుమ్ము,ధూలితో నాశనం అవుతున్నాయని మండలంలోని మల్లారం గ్రామ రైతులు లారీలను అడ్డుకున్నారు. సుమారు గంటపాటు లారీలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులకు గురైయ్యారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు వేసి ఎన్ని ప్రయసాలకొర్చుకొని పంటలు వేస్తే లారీల దుమ్ము,దులితో పంటలు నాశనం అవుతున్నట్లుగా వాపోయారు.ఇప్పటికైనా సంబంధించిన అధికారులు లారీల వేగం,అధిక లోడ్ తో వెళుతున్న లారీలను సీజ్ చేసి,డ్రైవర్ల లైసంచ్చును రద్దు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేదంటే లారీలను నిత్యం అడ్డుకొంటామని హెచ్చరించారు.సంఘటన స్థలానికి కొయ్యుర్ పోలీసులు చేరుకొని రైతులను శాoతిoపజేశారు.







కామెంట్లు (0)