Magazines

మొగి పరిరక్షణ, మల్చింగ్ తొలగింపే పొగాకు పంటకు శ్రేయస్కరం

09 నవంబర్, 2026

tobacco crops
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం

- ఐసీఏఆర్–ఎన్‌ఐఆర్సీఏ ఆర్‌ఎస్ ఫాం మేనేజర్ తేళ్ల రమేష్

నవతెలంగాణ – అశ్వారావుపేట

మురసు ముసురు ప్రభావంతో దెబ్బతిన్న వర్జీనియా పొగాకు పంటను వర్షాల అనంతరం కాపాడేందుకు మొగి పురుగు నివారణతో పాటు మల్చింగ్ పొరను తొలగించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టడం శ్రేయస్కరమని ఐసీఏఆర్–ఎన్‌ఐఆర్సీఏ ఆర్‌ఎస్ ఫాం మేనేజర్ తేళ్ల రమేష్ రైతులకు సూచించారు.


అశ్వారావుపేట మండలంలో మురసు ముసురు ప్రభావానికి లోనైన వర్జీనియా పొగాకు పంటను సోమవారం ఆయన పలు వ్యవసాయ క్షేత్రాల్లో పరిశీలించారు. ఆత్మ (బీఎఫ్‌ఏసీ) చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు వ్యవసాయ క్షేత్రంలోని పొగాకు పంటను పరిశీలించిన అనంతరం ఆయన నవతెలంగాణతో మాట్లాడారు. అశ్వారావుపేట ప్రాంతంలో సుమారు 70 శాతం వరకు పొగాకు పంట వర్షాల కారణంగా ప్రభావితమైందని తెలిపారు. అధిక వర్షాల కారణంగా మొగి పురుగు ఆశించే అవకాశం ఉందని, దీంతో రైతులు అప్రమత్తంగా ఉండి సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.


పొలాల్లో మల్చింగ్ పొర అలాగే ఉండటం వల్ల పొగాకు మొక్కల వేర్లకు తగినంత గాలి, ఆక్సిజన్ అందక మొక్కలు చనిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. అందువల్ల మల్చింగ్ పొరను తొలగించి సాళ్లు తోడడం ద్వారా మొక్కలకు గాలి అందేలా చూడాలని సూచించారు. దీంతో నీటి నిల్వ తగ్గి మొక్కలు తిరిగి కోలుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వర్షాలు పూర్తిగా వెలిసిన అనంతరం అవసరమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, పూర్తిగా దెబ్బతిన్న పొలాల్లో కొత్తగా పొగాకు మొక్కలు నాటుకోవడం మంచిదని తెలిపారు. పాక్షికంగా దెబ్బతిన్న పంటలో ఖాళీ ఏర్పడిన ప్రాంతాల్లో గ్యాప్ ఫిల్లింగ్ ద్వారా కొత్త మొక్కలు నాటుకోవాలని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆత్మ (బీఎఫ్‌ఏసీ) చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్