Magazines

ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ పోటీల్లో తెలంగాణకు రజతం

20 నిమిషాల క్రితం

Telangana wins silver at All India Police Band Competition
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

బిగిల్ విభాగంలో 
సత్తాచాటిన తెలంగాణ పోలీస్‌ బృందం

విజేతలను అభినందించిన డీజీపీ సీవీ ఆనంద్‌

​నవతెలంగాణ - ప్రత్యేక ప్రతినిధి

27వ ఆల్ ఇండియా పోలీస్‌ బ్యాండ్‌ పోటీలు (2026–27)లో రజత పతకం సాధించిన తెలంగాణ పోలీస్‌ బిగిల్ బృందాన్ని డీజీపీ సీవీ ఆనంద్‌ అభినందించారు.జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ పోలీసులు ప్రతిభను చాటడం గర్వకారణమని అన్నారు. నవంబరు 16- 20 వరకు హైదరాబాద్ లోని సీఆర్‌పీఎఫ్‌ గ్రూప్‌ సెంటర్‌ లో జరిగిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల, కేంద్ర పోలీస్ బలగాలు బ్యాండ్, బిగిల్ బృందాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ భవిష్యత్తులో తెలంగాణ పోలీస్ బిగిల్‌, బ్యాండ్ బృందాలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్ది, జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించేలా చర్యలు చేపడతామని తెలిపారు. రజత పతకం సాధించిన వారిలో ఎస్‌. సంతోష్‌ (హెచ్ సీ 1967), ఇంచార్జ్ అండ్ కెప్టెన్, కె.స్వామి (హెచ్ సీ 2562), ఎస్‌. వెంకటయ్య (హెచ్ సీ 873), జి. వెంకటస్వామి (హెచ్ సీ 1427), ఏవీఎస్‌ భావన రుషి (హెచ్ సీ 197), పీసీలు కె. రామ్ లాల్‌ (పీసీ 3361), ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ (పీసీ 10250) బృందంలో సభ్యులుగా ఉన్నారు. వీరు రాష్ట్రంలోని వివిధ పోలీస్‌ బెటాలియన్లు, పోలీస్‌ శిక్షణ సంస్థలు, హైదరాబాద్‌ సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌ లో పని చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఐజీ డాక్టర్ గజరావు భూపాల్, స్పోర్ట్స్ డీయస్పీ డాక్టర్ రామారావు తో పాటుగా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్