క్రీడాకారులు క్రమశిక్షణతో ఆడి జిల్లా పేరు నిలబెట్టాలి
నవతెలంగాణ ఆలేరు టౌను
క్రీడాకారులు క్రమశిక్షణతో రాష్ట్రస్థాయి కమిటీలలో పాల్గొని, యాదాద్రి భువనగిరి జిల్లా జట్టు పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని,
ఆలేరు ఎస్సై వినయ్ కుమార్ అన్నారు. వికారాబాద్‌లో ఈ నెల 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలుర కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా జట్టు గురువారం ఆలేరు పట్టణం నుండి బయలుదేరి వెళ్ళింది. ఈ సందర్భంగా ఆలేరు ఎస్సై వినయ్ క్రీడాకారులకు వీడ్కోలు పలికారు.
క్రీడల ద్వారా స్నేహ సంబంధాలు పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం సీనియర్ క్రికెట్ క్రీడాకారుడు ఎండీ ఖాదర్ జిల్లా జట్టు సభ్యులకు క్రీడా దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూల నాగయ్య, కౌన్సిలర్ పస్తo ఆంజనేయులు, నాయకులు బిజనీ మధుకుమార్ , కానిస్టేబుల్ యాతాఆకుల సైదులు, కబడ్డీ అసోసియేషన్ టెక్నికల్ చైర్మన్ చిందం విజయ్ కుమార్, జట్టు మేనేజర్ మంగళగిరి నరేష్, కోచ్ పూల చంద్రకుమార్, పారానంది రాహుల్ తేజ, కంసాని రాజు, కంసాని వెంకటేష్, టింకు కంసాని దినేష్, నిఖిల్, బైరి చెందీశ్వర్, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)