Magazines

ప్రాణాలతో పోరాడుతున్న చిన్నారి లహరి ప్రియకు మీరే ప్రాణం పోయాలి

25 నిమిషాల క్రితం

fighting for her life
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 13, 2026 | 2 నిమిషాల చదవడం

- ఒక లేత ప్రాణం నవ్వుల కోసం పరితపిస్తోంది

- కాలేయ మార్పిడికి మీ వంతు సాయం అందించండి

- దాతలను ప్రాధేయపడుతున్న తల్లిదండ్రులు 

నవతెలంగాణ-సత్తుపల్లి 

సత్తుపల్లి మండలం కాకర్లపల్లి తోట గణేష్,  కుమార్ బాల కుమారి దంపతుల 9 ఏళ్ల తోట లహరి ప్రియ అనే చిన్నారి ప్రాణాంతక కాలేయ వ్యాధి బారినపడి ప్రాణాలతో పోరాడుతోంది.  ​ఈ చిన్నారి 'ప్రోగ్రెసివ్ ఫ్యామిలియల్ ఇంట్రాహెపాటిక్ కొలెస్టాసిస్ టైప్ 4' (PFIC 4) అనే తీవ్రమైన జన్యుపరమైన కాలేయ వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి కారణంగా చిన్నారి లహరి 'డీకంపెన్సేటెడ్ క్రానిక్ లివర్ డిసీజ్' (ముదిరిన దీర్ఘకాలిక కాలేయ వ్యాధి) బారిన పడింది. చిన్నారి ప్రాణాలు నిలపాలంటే వీలైనంత త్వరగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (కాలేయ మార్పిడి శస్త్రచికిత్స) చేయాలని వైద్యులు స్పష్టం చేశారు. ఇదే ఈ ప్రాణాంతక వ్యాధికి ఏకైక శాశ్వత నివారణ చికిత్స అని వైద్య నిపుణులు తెలిపారు.


​చెన్నైలోని ప్రఖ్యాత 'గ్లెనీగల్స్ హాస్పిటల్స్' పీడియాట్రిక్ హెపటాలజీ (పిల్లల కాలేయ వ్యాధుల) విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మోహన్ బాబు కసాల ఈ విషయాన్ని వెల్లడించారు. మార్పిడికి ముందు నిర్వహించే వైద్య పరీక్షలు, జీవించి ఉన్న దాత నుంచి చేసే శస్త్రచికిత్సకు భారీగా ఖర్చు అవుతోంది. ఆసుపత్రి అంచనాల ప్రకారం ఈ మొత్తం వైద్య ప్రక్రియకు సుమారు రూ. 23 లక్షల  నుంచి రూ. 30 లక్షల వరకు ఖర్చవుతుందని తేలింది.


​అంత పెద్ద మొత్తాన్ని భరించే ఆర్థిక స్థోమత ఆ కుటుంబానికి లేకపోవడంతో దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన చిన్నారి ప్రాణాలు కాపాడుకోవడానికి తల్లిదండ్రులు గణేష్ కుమార్, బాల కుమారి దంపతులు దాతల సహకారం కోరుతున్నారు. చిన్నారి లహరి ప్రియ భవిష్యత్తును కాపాడటానికి చిన్నారి తల్లిదండ్రులు ఆపర్ణ హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. 


​మనం అందించే ప్రతి చిన్న ఆర్థిక సహాయం ఆ పాపకు పునర్జన్మను ప్రసాదిస్తుంది. ​దయచేసి మీ వంతుగా వీలైనంత విరాళాన్ని అందించి ఆ చిన్నారి కుటుంబానికి అండగా నిలవాలని వేడుకుంటున్నారు. అందరి సహకారంతో లహరి ప్రియ త్వరగా కోలుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేలా చేయాలని ఆ తల్లిదండ్రులు దాతలను ప్రార్థిస్తున్నారు.‌ PFIC 4' అనే మహమ్మారితో పోరాడుతున్న చిన్నారి లహరి ప్రియకు పునర్జన్మను ప్రసాదించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. సాయం అందించాలనే దాతలు ఈ క్రింది తెలిపిన బ్యాంకు ఖాతాకు గాని గూగుల్ లేదా ఫోన్ పీకి గాని సాయం అందించాలని కోరారు. ఎస్బీఐ, అకౌంట్ నెంబర్ 35039833133, IFSC CODE SBINOO13322, ఫోన్ పే లేదా గూగుల్ పే నెం. 9618079797 లకు‌ సాయం అందించి పాపప్రాణాలు నిలబెట్టాలని తల్లిదండ్రులు గణేష్ కుమార్ బాల కుమారి కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్