Tuesday, April 7, 2026
E-PAPER
Homeజిల్లాలురోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసుల ప్రత్యేక చర్యలు

రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసుల ప్రత్యేక చర్యలు

- Advertisement -
  • నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో సమీక్ష సమావేశం.

నవతెలంగాణ-మునిప‌ల్లి: రోడ్డు ప్రమాదాల నివారణలకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. మండలంలోని కంకోల్ టోల్ ప్లాజా వద్ద పోలీసు ఉన్నతాధికారులు మరియు టోల్ ప్లాజా యాజమాన్యంతో మంగళవారం నాడు సమీక్ష సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే స్పాట్లను గుర్తించాలని, సూచికలను ఏర్పాటు చేయాలని ఆయన టోల్ ప్లాజా సిబ్బందికి సూచించారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలు నివారణలో భాగంగా జాతీయ రహదారిపై మరమత్తు పనులు వెంట వెంటనే చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. ఆయన ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్, జహీరాబాద్ డిఎస్పి సైదా నాయక్ వలయాధికారులు వెంకటేష్,రామకృష్ణారెడ్డి,శివలింగం,సుమన్ కుమార్ ఎస్ఐలు వినయ్ కుమార్,కాశీనాథ్, రాజేందరరెడ్డి,నరేష్, రాజేష్ నాయక్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మేనేజర్ శివప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -