Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంగుజరాత్ జగన్నాథ రథయాత్రలో అప‌శృతి

గుజరాత్ జగన్నాథ రథయాత్రలో అప‌శృతి

- Advertisement -
  • భ‌క్తుల‌పైకి దూసుకెళ్లిన ఏనుగులు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: గుజరాత్‌లో నిర్వ‌హించిన‌ జగన్నాథ రథయాత్రలో అప‌శృతి చోటుచేసుకుంది. ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్ర తరహాలోనే గుజరాత్‌లోని గోల్‌వాడలో కూడా భక్తులు రథయాత్రను నిర్వహించారు. అయితే, నిర్వాహకులు యాత్రలో ప్రత్యేక ఆకర్షణకు ఏనుగులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యాత్ర ప్రారంభమైన 10 నిమిషాలకు అందులో ఉన్న ఓ ఏనుగు ఉన్నట్టుండి ఒక్కసారిగా జనం పైకి దాడి చేసుందుకు పరుగులు పెట్టింది.

ఇక, ఒక ఏనుగును చూసి మరొకటి కూడా భక్తుల పైకి దాడి చేసేందుు దూసుకెళ్లడంతో అక్కడ ఉన్న వారు భయపడి పరుగులు తీశారు. దీంతో రథయాత్ర సమయంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఆ ఏనుగులను నియంత్రించ‌డానికి మావటివాళ్లు కూడా ప్రయత్నించినప్పటికీ పరిస్థితి చేయిదాటిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 9 మందికి గాయాలు అయ్యాయి. ఆ తర్వాత గాయపడిన వారిని పోలీసులు చికిత్స కోసం సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img