Tuesday, October 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంబరాన్నంటిన దీపావళి సంబరాలు

అంబరాన్నంటిన దీపావళి సంబరాలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల వ్యాప్తంగా వెలుగుల దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. సోమ,మంగళవారం రెండురోజులపాటు పండుగ వేడుకలు జరుగుతోంది.ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలు,పెద్దలు,ముఖ్యంగా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రతి ఇంటా పిండి వంటలు, విందులతో జనం సందడి చేశారు. సాయంత్రం నుంచి టపాసుల సవ్వడి మొదలైంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు టపాసులు పెల్సి ఆనందించారు.దీపాల కాంతులతో ప్రతి గృహం దేదిప్యమానంగా వేలిగిపోయింది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ వేడుకల్లో మండల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు,వివిధ రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు హాజరై బాణసంచాలు పెల్సి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ దీపావళి ప్రజలు జీవితాల్లో వెలుగులు నింపుతూ.. సుఖసంతోషాలు, ఐస్టఐశ్వర్యాలు నిండాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -