Saturday, May 24, 2025
Homeతాజా వార్తలుఎఫ్‌సీఐ కన్సల్టేటివ్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌గా డీకే అరుణ

ఎఫ్‌సీఐ కన్సల్టేటివ్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌గా డీకే అరుణ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణకు చెందిన పార్లమెంట్ సభ్యురాలు (ఎంపీ) డీకే అరుణకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు చెందిన కన్సల్టేటివ్‌ కమిటీకి తెలంగాణ రాష్ట్ర ఛైర్‌పర్సన్‌గా ఆమెను నియమిస్తూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం ద్వారా రాష్ట్రంలోని ఆహార ధాన్యాల సేకరణ, సంబంధిత అంశాలపై డీకే అరుణ ప్రత్యేక దృష్టి సారించనున్నారు. తనకు ఈ నూతన బాధ్యతలు అప్పగించినందుకు డీకే అరుణ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -